ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Sat,June 15, 2019 12:18 AM

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. పీపుల్‌పహాడ్‌లో నిర్వహించిన బడిబాట కార్యక్రామానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులకు తన చేతుల మీదుగా పలకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే విద్యార్థుల ప్రగతికి సోపానాలని పేర్కొన్నారు. నిపుణులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు రాటుదేలుతారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు, భోజన సదుపాయం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేవి ప్రభుత్వ పాఠశాలలేనని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ సీహెచ్‌ రాణీరంగారెడ్డి, సామాజిక కార్యకర్త తాళ్ల యాదగిరిగౌడ్‌, ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...