వైద్యాధికారులు పనితీరు మెరుగు పర్చుకోవాలి


Sat,June 15, 2019 12:18 AM

భువనగిరి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తమ పనితీరు మెరుగు పరుచుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కలెక్టర్‌ సమావేశమై ప్రగతిని సమీక్షించారు. గర్భిణుల నమోదు కేవలం 43 శాతం మాత్రమే ఉన్నందున సోమవారంలోగా వంద శాతం ఆన్‌లైనులో నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా క్షయ వ్యాధి రోగులకు ప్రతి నెల చెల్లించే రూ.500 నగదు అందని వారికి వెంటనే వారి ఖాతాల్లోకి నగదు జమ చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల శాతం పెరగాలని, పనితీరులో మార్పు కనిపించని అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. సోమవారంలోగా పనితీరు మెరుగుపడనిచో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టడంతోపాటు బదిలీలు ఉంటాయని చెప్పారు. వ్యాధి నివారణ టీకాలు, స్కూల్‌ హెల్త్‌ పోగ్రామ్‌ల ప్రగతి నివేదికలపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతి నివేదికల విషయంలో సాధించిన ప్రగతిని కాగితాలపై చూపించడం కాకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, తద్వారా గర్భిణులకు, టీబీ వ్యాధిగ్రస్తులకు ఇతరత్రా లబ్ధిచేకూరుతుందని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సాంబశివరావు, ప్రత్యేకాధికారి ప్రియాంక తదితరులున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...