గురుకుల పాఠశాలలతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్‌


Sat,June 15, 2019 12:18 AM

ఆలేరుటౌన్‌: విద్యార్థులు భవిష్యత్‌కు మంచి పునాది వేసేది గురుకుల పాఠశాలలేనని టీఎస్‌ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సునీత తెలిపారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు క్యాంపస్‌ విద్యార్థులు 150 మంది నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్‌కు అర్హత సాధించినవారి ఫ్ల్లెక్సీలను ప్రదర్శించారు. ఇటీవల జరిగిన అన్ని కామన్స్‌ ఎంట్రన్స్‌ పరీక్ష్ల ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు విజయఢంకా మోగించారని ఈ సందర్భంగా తెలిపారు. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వం ప్రారంభించిన రెండు సంవత్సరాలలోనే ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారన్నారు. ఉన్నతబోధన, మంచి పౌష్టికాహరం, సువిశాలమైన విద్యార్థుల ప్రాంగణాలు, లైబ్రరీ, సైన్స్‌ల్యాబ్‌, కంప్యూటర్‌ విద్య, ఆహ్లదకరమైన వాతావరణంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు ఇప్పటికైనా గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి వారికి మంచి భవిష్యత్‌ను కల్పించాలని కోరారు. పలు బ్యానర్లను ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎల్లయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ అనుపమ, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ పద్మ, అధ్యాపకురాలురు గాయత్రి, జ్యోతి, వినోలియా, శోభ, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...