నిషేధిత కలుపు మొక్కల మందు స్వాధీనం


Sat,June 15, 2019 12:18 AM

ఆలేరుటౌన్‌ : ఆలేరు పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన కలుపు మొక్కల నివారణ మందులను మండల వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల వ్యవసాయాధికారి ఎస్‌.పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. నాసిరకం విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు ఆలేరు పట్టణంలోని పలువురి ఇండ్లల్లో డివిజన్‌ వ్యవసాయాధికారి బి.వెంకటేశ్వరరావు, ఆలేరు ఎస్సై జె.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక పోచమ్మగుడి సమీపంలోని తిరుమలరెడ్డి లింగారెడ్డి ఇంటిలో 410 లీటర్ల నిషేధిత ైగ్లెపోగాన్‌ కలుపు మొక్కల నివారణ మందును స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో ప్రభుత్వం రద్దు చేసిన కలుపు మొక్కల మందు నిల్వచేసినందుకు చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు నాసిరకం విత్తనాలు కొని సాగుచేస్తే ఆర్థికంగానే కాకుండా చట్టప్రకారం శిక్షార్హులతారని తెలిపారు. ఈ తనిఖీలో పట్టుబడిన కలుపుమొక్కల మందును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై ఇంద్రారెడ్డి, వ్యవసాయ ఏఈవోలు, పోలీసులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...