స్థానిక పాలన.. మరింత చేరువ


Thu,June 13, 2019 11:54 PM

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ప్రజలకు స్థానిక పాలన మరింత చేరువ కానున్నది. ఒకప్పుడు ఏ పనికి అయినా నల్లగొండకు పరుగులు పెట్టాల్సి వచ్చేంది. ఇప్పుడు యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంగా ఏర్పడింది. పంచాయతీరాజ్ పాలనతో పరిపాలన సులభమైనది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లా రెండుగా విభజించబడింది. దీంతో మండలాల సంఖ్య విస్తృతంగా పెరిగింది. 500 జనాభా కలిగిన తండాలు జీపీలుగా మారాయి. ఒక జిల్లా పరిషత్ మూడుగా, ఉమ్మడి జిల్లాలో 59 మండల పరిషత్‌లు ఇప్పుడు మూడు జిల్లాల్లో కలుపుకుని 71 కి చేరడంతో స్థానిక నాయకుల సంఖ్య పెరిగింది. కొత్త జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల అనంతరం జరిగిన మండల అధ్యక్షుల ఎన్నికల్లో కొత్త తరం నాయకులే మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో అడుగు పెడుతున్నారు. మండల వ్యవస్థ ఆవిర్భావానికి మందు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంచాయతీ సమితులున్నాయి. వీటి స్థానంలో 59 మండలాలు ఏర్పాటు అయ్యాయి. తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి , మండల విద్యాధికారి.. ఈ విధంగా పలు సేవలను అందించేందుకు మండల స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ 2016లో నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి జిల్లాలో మండలాల సంఖ్య 71కి పెరిగాయి. నల్లగొండ జిల్లాలో 31 మండలాలు, సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి. జిల్లాలో 401 గ్రామపంచాయతీలున్నాయి. గతంలో 317 పంచాయతీలుండేవి. కొత్తగా 84 జీపీలు ఏర్పడ్డాయి. వీటిలో 34 తండాలు జీపీలుగా మారాయి. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామపంచాయతీలతో జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణ ఎంతగానో ప్రగతికి దోహదపడుతున్నది.

ప్రజల వద్దకు పాలన
ప్రజల వద్దకు పాలన రావడంతో లబ్ధిదారులకు పథకాలు నేరుగా చేరుతాయి. ఇప్పుడు యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంగా ఏర్పడింది. కొత్త జిల్లాలో మండలాలు, గ్రామాల సంఖ్య పెరిగింది. భౌగోళిక మార్పులతో కొత్త నాయకత్వానికి ఊతం లభించింది. గ్రామీణ పరిపాలనను పరుగులు పెట్టించేలా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులతో అనుకున్న లక్ష్యం నెరవేరే విధంగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్‌లో మహిళలకు పెద్దపీట వేసింది.

రాజకీయ నాయకత్వానికి నాంది
ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లకు అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. మండల వ్యవస్థతో, అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీల వ్యవస్థతో ఆయా సామాజిక వర్గాల్లో, మహిళల్లో రాజకీయ నాయకత్వం విస్తృతంగా ఎదగడానికి దోహదం చేస్తోంది. విద్యావంతులైన వారు.. యువత కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇక మండల వ్యవస్థతో పాలన సులభతరం అయింది. తమ పనుల కోసం ప్రజలు సుదూర ప్రాంతాలను వెళ్లకుండా కొద్ది కిలో మీటర్ల దూరాల్లో ఉన్న మండలాలకు సులువుగా వెళ్లే అవకాశం ఏర్పడింది. నూతనంగా నల్లగొండ, యాదాద్రిభువనగిరి జిల్లాలకు వేర్వేరుగా జిల్లా పరిషత్‌లు ఏర్పడడంతో జిల్లా పరిషత్ సేవలు కూడా చేరువ కానున్నాయి. 1987లో ఏర్పడిన మండల పరిషత్‌లకు అధ్యక్షుల ఎన్నిక నేరుగా జరిగేది. ఆ తర్వాతకాలంలోఎంపీటీసీల వ్యవస్థ ఆవిర్భవించడంతో ఆయా మండలాల్లోని ఎంపీటీసీల నుంచి ఒకరిని మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకొనే విధంగా వచ్చింది. జడ్పీటీల వ్యవస్థ వచ్చాక జిల్లాలోని జడ్పీటీసీ సభ్యుల్లో ఒకరిని జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకునే విధంగా అమలవుతున్న సంగతి విధితమే.

గతంలో ఇలా...
పంచాయతీరాజ్ వ్యవస్థలో 1987లో ఓ వినూత్న పరిణామం చోటు చేసుకున్నది. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌గా ఉన్న మూడెంచల పంచాయతీ రాజ్ విధానంలో పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు అలాగే ఉన్నా అప్పటి వరకు ఉన్న పంచాయతీ సమితులు మాత్రం రద్దు చేయబడ్డాయి. వీటి స్థానంలో మండల వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత క్రమంలో మండల ప్రాదేశిక నియోజకవర్గాలు(ఎంపీటీసీ), జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు(జడ్పీటీసీ) అనే నూతన వ్యవస్థ ఏర్పడింది. వీటిల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలనే లక్ష్యంగా జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేయడం మూలంగా పంచాయతీరాజ్ పాలన మరింతగా వికేంద్రీకరణ అయింది. పదిలోపు గ్రామాలతో కూడా మండలాలు ఏర్పడ్డాయి. మండల స్థాయిలో రెవెన్యూ, విద్య తదితర సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మండల వ్యవస్థతో ఈ విధంగా పాలనా సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2016లో నూతన జిల్లాలు పరుడుపోసుకున్నాయి.

మహిళలకు పెద్దపీట
మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడం మొదలుకొని జిల్లా, మండల పరిషత్‌లను పాలించే స్థానాల్లోనూ నారీమణులకే ఎక్కువ అవకాశం దక్కింది. ప్రభుత్వం కల్పించిన 50 శాతం రిజర్వేషన్ల మూలంగా ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయిన జిల్లాలో మహిళలే ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటర్ల పరంగా చూసినప్పుటికీ వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే పంచాయతీలు మొదలుకొని మున్సిపాలిటీ వరకూ మహిళల పెత్తనం సాగుతోన్న నేపథ్యంలో యాదాద్రిభువనగిరి జడ్పీ చైర్మన్ స్థానం పురుషులకు దక్కింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ పదవుల్లోనూ మహిళలకే ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. 17
10 ఎంపీపీ స్థానాలు మహిళలే కైవసం చేసుకున్నారు. జడ్పీటీసీ స్థానాల్లో వారే గెలుపొందారు. 402 పంచాయతీల్లోనూ సగం దీంతో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మహిళలు, యువతలతో పాటు గ్రామ స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధుల సతీమణులు బరిలో నిలిచి గెలిచి గ్రామాల్లో క్రియాశీలక భూమిక పోషించనున్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...