ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Thu,June 13, 2019 11:51 PM

సంస్థాన్‌నారాయణపురం: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని సర్పంచ్ కట్టెల భిక్షపతి అన్నారు. సర్వేల్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుండటంతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రతిఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల న్నారు. గతేడాది పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన జి.కీర్తనను సర్పంచ్ అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మొగిలిపాక వెంకటయ్య, ఎంపీటీసీ ఈసం యాదయ్య, హెచ్‌ఎం విద్యాధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు నర్సింహ, రమేశ్, నాగభూషణాచారి, వనజ, పద్మలక్ష్మి, రామకృష్ణ, అబ్దుల్జ్రాక్, నీరజనీల, అరుణనీల, నర్సిరెడ్డి, వెంకటలక్ష్మి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

బడిబాటను విజయవంతం చేయాలి
ఈ నెల 14 - 19 వరకు ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈవో గుర్రం వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం పాఠశాలలో మౌలిక సదుపాలయాలు ఉన్నాయని, పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రైవేట్ బడులకు దీటుగా పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా వస్తున్నదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేరేలా ప్రోత్సాహించాలని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు విద్యాధర్‌రెడ్డి, హన్మంతు, సుమిత్ర, ఉషారాణి, ప్రాథమిక పాఠశాల ప్రదానోపాద్యాయులు, ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.

రామన్నపేట : బడిబాటను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎంఈవో దుర్గయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని భవిత సమావేశ మందిరంలో బడిబాట కార్యాచరణను ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. హెడ్మాస్టర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్లు పాఠశాల అడ్మిషన్లు పెంచాలని ఆయన కోరారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ హెడ్మాస్టర్లు ఎం.జోసఫ్‌కుమార్, సంజీవ రెడ్డి, ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మోత్కూరు : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన అందుతుందని మోత్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్‌ఎం అండెం వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లోనే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, కంప్యూటర్ బోధన, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, ట్రిపుల్ ఐటీ అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇండ్ల రాంప్రసాద్, శ్రీదేవి, మంజూల, గుమడెల్లి వెంకన్న, వారాల యాదగిరి, ధర్మారపు వెంకటయ్య, గాదే వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...