దయాకర్‌గౌడ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పైళ్ల, మాజీ ఎంపీ బూర


Thu,June 13, 2019 11:51 PM

భూదాన్‌పోచంపల్లి : ఇటీవల బైక్‌పై వెళ్తూ అదుపుతప్పి రేవణపల్లి చెరువులోపడి గాయపడ్డ ఇంద్రియాల గ్రామానికి చెందిన బండి దయాకర్ హయత్‌నగర్‌లోని టైటాన్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. గురువారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ దవాఖానలో ఆయనను పరామర్శించారు. వారితోపాటు భూదాన్‌పోచంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు బత్తుల శ్రీశైలంగౌడ్, రాజుయాదవ్ ఉన్నారు.

మృతుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ..
భువనగిరి అర్బన్ : మండలంలోని తుక్కాపురం సమీపంలోని గ్లాస్ కంపెనీ ముందు గౌస్‌నగర్ గ్రామానికి చెందిన శ్రీశైలంను బుధవారం డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి ఏరియా దవాఖానాలో శ్రీశైలం మృతదేహన్ని సందర్శించి.. మృతికి గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీశైలం మృతదేహాన్ని పరామర్శించిన వారిలో భువనగిరి జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లమ్య, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు జనగాం పాండు, తుక్కాపురం, గౌస్‌నగర్ ప్రజలు ఉన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...