ఆలయ పునఃనిర్మాణానికి జడ్పీటీసీ విరాళం


Thu,June 13, 2019 11:51 PM

మోత్కూరు : మండలంలోని అనాజిపురంలోని ఆంజనేయ స్వామి ఆలయం పునః నిర్మాణానికి రూ.10 లక్షల విరాళం జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి ప్రకటించారు. గురువారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం పునః నిర్మాణ పనులకు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి భూమిపూజ చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తమకు ఎంతో విశ్వాసంగా ఉన్న ఆలయ పురోభివృద్ధికి తాము స్వచ్ఛందంగా రూ.10లక్షల విరాళం అంద చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా గ్రామంలో ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ పురోహితులు మోత్కూరు సందీప్‌శర్మ ప్రత్యేక మంత్రోచ్ఛారణను చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ మలిపెద్ది నర్సిరెడ్డి, మాజీ సర్పంచ్ నిమ్మల వెంకటేశ్వర్లు, మాజీ ఉప సర్పంచ్ దేవర శ్రీశైలం, టీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లందాసు వెంకటయ్య, గ్రామస్తులు గోరుపల్లి సతీశ్‌రెడ్డి కొల్లు రామకృష్ణ, పంజాల రామకృష్ణ, చల్లా రామకోటి పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...