లక్ష్మీనరసింహుడికి లక్షపుష్పార్చన


Thu,June 13, 2019 11:51 PM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఏకాదశి సందర్భంగా శ్రీవారికి లక్షపుష్పార్చన చేశారు. ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య కల్యాణం జరిగాయి. కొండపైన గల పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి.

ఘనంగా సత్యనారాయణ వ్రతాలు
యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాలు జరిగాయి. పూజల్లో అధిక భక్తులు పాల్గొని మొక్కులు చల్లించుకున్నారు. వ్రత పూజల ద్వారా రూ. 86, 500ల ఆదాయం సమకూరింది. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 10,43,915 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ.10, 43, 915 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1, 29, 632, 100 రూపాయల టికెట్‌తో రూ. 61, 000, కల్యాణకట్ట ద్వారా రూ. 38, 000, గదులు విచారణ శాఖతో రూ. 18, 000, ప్రసాదవిక్రయాలతో రూ. 4, 71, 820, శాశ్వత పూజలతో రూ.10, 116 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...