ఎంజీయూలో ఐదు నూతన కోర్సులు


Thu,June 13, 2019 11:50 PM

ఎంజీయూనివర్సిటీ : ఎంజీయూ 2007-08లో ప్రారంభమైంది. 13 విభాగాల్లో 15 పీజీ కోర్సు లు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. అయితే ప్రారం భం నాటి నుంచి విద్య, మాతృభాష, క్రీడల కోర్సులను 2019-20 విద్యాసంవత్సరానికి ప్రా రంభించడం ఒక వరంలా మారింది. ఈ కోర్సుల్లో అడ్మిషన్లు జరగనున్నాయి. మరోవైపు ఆయా విభాగాల్లో పని చేసేందుకు అధ్యాపకులను సైతం భర్తీ చేయనుండటంతో కొందరికి ఉపాధి దొరకనుంది.

నూతన కోర్సులు ఇవే....
ఎంజీయూలో 2019-20 సంవత్సరానికి నూతనంగా 5 పీజీ కోర్సులు ప్రారంభిస్తున్నారు. వీటి లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఈడీ), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ), ఎంఏ విభాగంలో డెవలప్‌మెంట్ స్టడీస్, హిస్టరీ అండ్ టూరిజం, తెలుగు కోర్సులు ఉన్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిబంధనల మేరకు వీటి లో అడ్మిషన్లు జరుగుతాయి.

ఎంజీయూలో వసతులతోనే కోర్సులు...
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తు నిధులను మంజూరు చేయడంతో ఎంజీయు అభివృద్దిలో ముందడుగు వేస్తుంది. వీసీ విజన్‌తో ముందుకు వెళుతు ఓ వైపు మౌళిక వసతులు, మరో వైపు విద్యకు ప్రాధాన్యత నిస్తు నిరంతర పర్యవేక్షణ చేస్తుండటంతో వసతులు పెరిగాయి. విశాలమైన క్రీడా మైదానాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతోనే నూతన కోర్సుల మంజూరుకు అవకాశం కలుగడంతో హర్షం వ్యక్తమవుతుంది.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...