ఘనంగా లింగయ్యయాదవ్ జన్మదినం


Thu,June 13, 2019 11:50 PM

భువనగిరి, నమస్తే తెలంగాణ : రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ జన్మదిన వేడుకలు గురువారం పట్టణంలోని రహదారిబంగ్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నువ్వుల ప్రసన్న, ఎంపీపీ తోటకూరి వెంకటేశ్‌యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. సేవాభావం కలిగిన నాయకుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అని కొనియాడారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీఏఈసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శెట్టి బాలయ్యయాదవ్, నాయకులు నరాల వెంకటస్వామి, వినోద్‌కుమార్, కుతాడి సురేశ్, వల్లపు ప్రవీణ్‌యాదవ్, గుండెబోయిన సురేశ్‌యాదవ్, రాసాల వెంకటేశ్‌యాదవ్, ప్రణీత్, రంగ, భాను, కె.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...