రైతు సంక్షేమానికే ఫసల్ బీమా


Thu,June 13, 2019 12:23 AM

- హెక్టార్ వరి పంటకు బీమా మొత్తం రూ.85 వేలుగా ఖరారు
- మొక్కజొన్నకు రూ.65,200
- వరి రైతులు చెల్లించే ప్రీమియం రూ.1,250
- వరికి ప్రీమియం చెల్లించే గడువు ఆగస్టు 31
- మక్కకు జూలై 31
యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్, సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నది. పంటలు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర పప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)ను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పెసర, కంది, మినుము, సోయాబీన్ పంటలకు పీఎంఎఫ్‌బీవై వర్తించనున్నది. ఈ ఏడాది వరి, మొక్కజొన్న పంటల కోసం జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. పంటల వివరాలు, ప్రీమియం చెల్లించేందుకు నిర్ణయించిన ఆఖరి తేదీలను రైతులకు అధికారులు తెలియజేస్తున్నారు. హెక్టార్ లెక్కన మొత్తాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. వరి ఆగస్ట్టు 31లోగా చెల్లించాలి. మొక్కజొన్నకు రూ. 62,500 బీమా మొత్తంగా నిర్ణయించగా... ఇవి సాగు చేసే రైతులు రూ. 1,250 ప్రీమియాన్ని జూలై 31లోగా చెల్లించాల్సి ఉంటుంది.

రైతులను ఆదుకునేందుకు ..
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంఎఫ్‌బీవై అమలు చేస్తున్నాయి. త్వరలో కలెక్టరేట్‌లో జిల్లాలో వ్యవసాయ అధికారులు, ఏఈవోలకు ఫసల్ బీమా పథకంపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో అత్యధిక సంఖ్యలో రైతులు సాగు చేసిన పంటలకు బీమా ప్రీమియం కట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. దీంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అవసరమైన కార్యచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

ఫసల్ బీమాపై విస్తృత ప్రచారం..
వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతన్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుపై విస్తృత ప్రచారం చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. రైతులు సాగు చేసే వివిధ పంటలకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు, ప్రీమియం చెల్లించడానికి ఆఖరు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా జిల్లాలోని రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలకు రైతులు ప్రీమియం చెల్లించేలా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంట నష్టోయిన రైతులకు గ్రామ యూనిట్లుగా పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవై అమలు చేస్తున్నది. దీనికోసం రైతుల నుంచి ప్రీమియం సేకరించి పంట నష్టోయిన రైతులకు పరిహారం పంపిణీ చేసేందుకు ప్రతి సంవత్సరం ఏదేని ఒక బీమా కంపెనీని ఎంపిక చేస్తున్నది. జిల్లాలో ఈ సంవత్సరం ఏఐసీ ఆఫ్ ఇండియాకు పీఎంఎఫ్‌బీవై అమలు బాధ్యతను అప్పగించారు. దీతో ప్రస్తుత వానకాలం కోసం ఈ కంపెనీ రైతుల నుంచి పీఎంఎఫ్‌బీవై అమలుకు ప్రీమియం సేకరించనున్నది.

ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకు ఈ పథకం కింద గ్రామ యూనిట్‌గా బీమా చేయనున్నారు. జిల్లాలో వరి ప్రధన పంటకాగా ఆరుతడి పంటగా పత్తి, కంది, మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు పీఎంఎఫ్‌బీవై పథకం అమలుకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. రైతులను కలిపి ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారుల సమీక్ష సమావేశంలో అధికారులను అదేశించారు. దీంతో వ్యవసాయం అధికారులు జిల్లాలోని రైతులందరూ వారు సాగు చేసే విధంగా వివిధ రకాల పంటలను బీమా ప్రీమియం చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులందరూ ప్రీమియం చెల్లించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం వరి పంటకు బీమా చేయడానికి హెక్టార్ కు రూ. 1,700 అంటే ఎకరానికి రూ. 680 ప్రీమియం చెల్లిస్తే పీఎంఎఫ్‌బీవై లో చేరవచ్చునని వరి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మొక్కజొన్నకు హెక్టారుకు రూ. 1,250 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఏ పంటకు ఎంత ప్రీమియం
పీఎంఎఫ్‌బీవై కోసం రైతులు తమ పంటలను బీమా చేయడానికి ప్రభుత్వం ప్రీమియం ఖరారు చేసింది. పంటల వారీగా హెక్టారు లెక్కన బీమా చేసే మొత్తాన్ని నిర్ణయించింది. వరి పంటకు రూ. 85 వేలు, మొక్కజొన్న పంటకు రూ. 62,500, కంది, జొన్న పంటలకు రూ. 37,500, సోయాబీన్ పంటకు రూ. 55 వేలు, పసుపు పంటకు రూ. 1.5 లక్షలు, బీమా మొత్తంగా ప్రభుత్వం ఖరారు చేసింది. పసుపు ఇతర పంటలన్నింటికీ బీమా మొత్తంలో రైతు వాటాగా రెండు శాతం ప్రీమియం నిర్ణయించింది. వరి పంటసాగు చేసే రైతులు హెక్టార్‌కు రూ. 1,700 మొక్కజోన్న రైతులు రూ. 1,250, పసుపు రైతులు రూ. 750, కంది, జొన్న సాగు చేసే రైతులు రూ. 700, సోయాబీన్ సాగు చేసే రైతులు రూ.1100, ప్రిమీయాన్ని ఏఐసీ ఆఫ్ ఇండియా పేర చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వం చివరి తేదీను సైతం ఖరార్ చేసింది.

మొక్కజోన్న, పెసర, కంది, మినుము, సోయాబీన్, పసుపు,జొన్న పంటలు సాగు చేసే రైతులు జూలై 31లోగా, వరి పంట సాగు చేసే రైతులు ఆగష్టు 31వ తేదీలోగా పీఎంఎఫ్‌బీవై కింద పంట బీమా చేసేందుకు రైతులందరూ అర్హులే. ఈ పథకం కోసం బీమా రైతులకు ప్రకృతి వైఫరిత్యాలు, ఇతర ప్రమాదాల వల్ల పంట నష్టం సంభవిస్తే పరిహారం అందనున్నది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 2019 వానాకాలం కోసం పంట రుణాలు పొందే రైతులు పీఎంఎఫ్‌బీవై కి తప్పనిసరిగా అర్హత పొందుతారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి గాని పంట రుణాలు పొందని రైతులు కూడా స్వచ్ఛందంగా ఈ పథకం కింద బీమా చేసేందుకు ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ప్రతిపాదన పత్రాన్ని అవసరమైన ఇతర పత్రాలను జత చేసి ప్రీమియం మొత్తాన్ని అందుబాటులో ఉన్న వాణిజ్య బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, కామన్ సర్వీస్ సెంటర్లలో చెల్లించి పీఎంఎఫబీవై లో రైతులు చేరవచ్చు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...