యాదాద్రిలో నిత్య పూజల కోలాహలం


Thu,June 13, 2019 12:22 AM

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీలక్ష్మీనరసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు బుధవారం నిర్వహించారు. సుప్రభాతం చేపట్టిన అర్చకులు ప్రతిష్టామూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదనలు చేపట్టారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం, అర్చన, లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. బాలాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి రోజు ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాలను సంప్రదాయంగా నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు ఆరాధన జరిపి సహస్రనామార్చన నిర్వహించారు. కొండపైన గల రామలింగేశ్వరాలయంలో శివుడిని ఆరాధిస్తూ అభిషేకించి అర్చనలు చేశారు. పార్వతీదేవిని వేదమంత్రాలతో కొలిచారు. పలువురు భక్తులు హరిహరులను దర్శించి మొక్కు పూజలు చేపట్టారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పెద్ద ఎత్తున జరిగాయి. వ్రత పూజల ద్వారా రూ. 29, 000 ఆదాయం సమకూరింది.
శ్రీవారి ఖజానాకు రూ. 8, 88, 333 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 8, 88, 333ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 66, 192, 100 రూపాయల టికెట్‌తో రూ. 1, 05, 200, కల్యాణకట్ట ద్వారా రూ. 26, 000, గదులు విచారణ శాఖతో రూ. 66, 770, ప్రసాదవిక్రయాలతో రూ. 3, 98, 225, శాశ్వత పూజల ద్వారా రూ. 16, 116తో పాటు అన్ని విభాగాల ద్వారా రూ. 8, 88, 333 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...