గురుకుల పాఠశాలను తరలించకండి


Thu,June 13, 2019 12:21 AM

మోత్కూరు : మోత్కూరులోని బాలుర గురుకుల పాఠశాలను భువనగిరికి తరలించ వద్దని బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను కొంతకాలంగా అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. భవనంలో మౌలిక వసతులు లేవని భువనగిరిలోని కేబీఆర్ కళాశాలకు తరలించాలని జిల్లా ఆర్‌ఎస్‌వో రజని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రిన్సిపాల్ వెంకటస్వామి తరలించేందుకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. తనకు ఇంటి అద్దె చెల్లించాలని, ఆ తర్వాతనే పాఠశాలను మార్చు కోవాలని యజమాని సీహెచ్ సత్యంగౌడ్ పాఠశాల గేట్‌కు తాళం వేశారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌ఎస్‌వో అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను పంపి పునరాలోచన చేయనున్నామని ఆర్‌ఎస్‌వో తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు దామరోజు శ్రీకాంతాచారి, కందుల విక్రాంత్, దాసరి తిరుమలేశ్, గడ్డం నర్సింహ, మందుల సురేశ్, క్రాంతి పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...