ఘనంగా ఆంజనేయుడికి పూజలు


Tue,June 11, 2019 11:40 PM

యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి వారికి మంగళవారం ఆకు పూజ ఘనంగా నిర్వహించారు. ఆంజనేయస్వామి వారిని శ్రీచందనంతో అలంకరించారు. జిల్లేడు పూలు, తమలపాకులతో అర్చన చేశారు. ఆంజనేయస్వామివారికి ఇష్టమైన తినుబండారాలను నైవేద్యంగా సమర్పించారు. వడపప్పు, బూరెలు, అరటి పండ్లు సమర్పించి హనుమాన్‌చాలీసా పఠించారు. కార్యక్రమాలను ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నర్సింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్లరంగాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహుడి నిత్య పూజలు ఘనంగా జరిగాయి. దర్శనాలు, అన్నదానం, ప్రసాద విక్రయాలుల్లో భక్తులు పాల్గొన్నారు. సామూహిక సత్యనారాయణస్వామి వారి వ్రతాలు ఘనంగా జరిగాయి.
శ్రీవారి ఖజానాకు రూ. 10, 00, 453 ఆదాయం
పూజాకైంకర్యాల ద్వారా స్వామి వారికి రూ. 10, 00, 453 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. శ్రీవారికి ప్రధాన బుకింగ్ ద్వారా రూ.69,526, 100 రూపాయల దర్శనం టికెట్‌తో రూ.68, 300, వ్రత పూజలతో రూ. 47, 500, ప్రసాద విక్రయాలతో రూ. 4, 45, 795, విచారణ శాఖతో రూ. 55, 320, శాశ్వత పూజలతో రూ. 8, 000 పాటు అన్ని విభాగాల నుంచి ఈ ఆదాయం సమకూరింది.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...