పైళ్ల పై జరిగే విషప్రచారాన్ని నమ్మొద్దు


Mon,May 27, 2019 02:48 AM

వలిగొండ : భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్యప్రచారాలను నమ్మొద్దని వలిగొండ టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, టీఆర్‌ఎస్ నాయకులు పల్సం రమేశ్ అన్నారు.ఆదివారం పట్టణ కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలల్లో భువనగిరి పార్లమెంట్ స్థానంలో పోటీచేసిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసారు. కొంతమంది గిట్టనివారు దీన్ని సాకుగా తీసుకొని టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలను సృష్టించడంకోసం పైళ్ల శేఖర్‌రెడ్డిపై నీచప్రచారానికి దిగి పార్టీ నాయకత్వాన్ని గందరగోల పరిచే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు. పైళ్ల శేఖర్‌రెడ్డిపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిని వారు తీవ్రంగా ఖండించారు.ప్రజలు ఇలాంటి చౌకబారు చేష్టలు,ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

బూర విజయాన్ని అడ్డుకున్న రోడ్‌రోలర్
టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ దురదృష్ట వశాత్తు ఓటమి చెందారని నిజానికి నైతిక విజయం బూర నర్సయ్య దేనని అన్నారు.భువనగిరి నియోజక వర్గంలో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికి కారుగుర్తుకు దగ్గర పోలికలు ఉండే రోడ్‌రోలర్ గుర్తు కూడా ఉండటంతో అంతగా అవగాహన లేని ఓటర్లు ఇదే కారుగుర్తుగా భావించి ఓటు వేసి ఉంటారన్నారు.టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి పడవలసిన ఓట్లు రోడ్‌రోలర్ గుర్తుకు పడ్డాయని ఈ క్రమంలో 27 వేల ఓట్లకు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థికి రావడంతో బూర ఓటమి పాలయ్యారన్నారు. కారు, రోడ్‌రోలర్ గుర్తుతో తికమకపడ్డ ఓటర్ల వలన బూరఓటమి చెందారని అన్నారు.

జరుగుతున్న ప్రచారం మానుకోవాలి
సుజల దాత, బడుల బలహీన వర్గాల అభ్యన్నతి కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై కుసంస్కారంతో పనిగట్టుకొని విషప్రచారం జరుగుతుందని పార్లమెంట్ ఎన్నికల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను గెలిపించడం కోసమని కార్యకర్తల కన్న ముందుగా గ్రామాలకు చేరుకొని ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే పైళ్లపై బురద జల్లే ప్రచారాన్ని సహించేది లేదని,బూర నర్సయ్యగౌడ్ గెలుపు కోసం నూటికి నూరు శాతం కృషి చేసిన పైళ్ల శేఖర్‌రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఆపివేయాలని,లేని పక్షంలో సైబర్ క్రైం చట్టాల ప్రకారం చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్, మామిండ్ల రత్నయ్య, సోమనబోయిన సతీశ్, కొండూరి బాల్‌రాజు, ఎల్లంకి నాగరాజు, బత్తిని శేఖర్, ఎస్‌కే.ఆజం, రషీద్, ఆజంఖాన్, సతీశ్ పాల్గొన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...