బడీడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలి


Sat,May 25, 2019 11:24 PM

వలిగొండ : బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని గోకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు మేడి యాదయ్య అన్నారు. మండల పరిధిలోని గోకారంలో బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి శనివారం బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధిస్తున్నామని, ప్రతి విద్యార్థికి రెండు జతల ఉచిత యూనిఫాం, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, దివీస్ కంపెనీ సహాయంతో ఉచిత నోట్స్, హార్లిక్స్ ప్యాకెట్స్‌ను విద్యార్థులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఎం.లింగస్వామి, టి.భిక్షపతి, కల్లూరి రమేశ్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...