ఘనంగా ఎమ్మెల్యే దంపతుల వివాహావార్షికోత్సవం


Sat,May 25, 2019 11:24 PM

మోటకొండూర్(యాదగిరిగుట్టరూరల్) : ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతుల వివాహా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఇరువురు కలిసి పలువురు నేతల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి పాల్గొని ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి దంపతులు మాట్లాడుతూ.. 2001 ఉద్యమకాలం నాటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీతో పాటు తమతో వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు ఆలేరు ప్రజలు వెన్నంటి ఉండి, ఆలేరు ఉద్యమపంథా మరోసారి చూపారని చెప్పారు.

నైతికంగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గెలిచారని వారు స్పష్టం చేశారు. మాజీమంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో నిండునూరేండ్లు ఆయూ ఆరోగ్యాలతో జీవించాలని ఆకాక్షించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆలేరు ప్రాంత అభివృద్ధి ప్రదాతలైన గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నవారికి ఆలేరు ప్రజలు రుణపడి ఉంటారని అభివర్ణించారు. అనంతరం యాదగిరిగుట్ట మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, కౌకుంట్ల శ్రీకాంత్‌రెడ్డి, కోల వెంకటేశ్, గుణగంటి బాబురావు తదితరులు గొంగిడి దంపతులను గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు భూపతి వెంకటేశ్వర్‌రావు, శ్రీనివాస్, డ్రైవర్లు కానుగు రాజు, సిబ్బంది, మోటకొండూర్ టీఆర్‌ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి పళ్లా వెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ రాణువ నర్సింహారావు, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...