దాసరి పురస్కార అవార్డు గ్రహీతకు సన్మానం


Sat,May 25, 2019 11:24 PM

మోత్కూరు: దాసరి పురస్కార అవార్డు గ్రహీత, విశ్రాంత ఉపాధ్యాయులు సూరోజు భాస్కరాచారి- యాదమ్మ దంపతులను ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సన్మానించారు. శనివారం పట్టణంలో అవార్డు గ్రహీత సూరోజు భాస్కరాచారి- యాదమ్మ దంపతులకు శాలువా కప్పి పూల మాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జి.లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. భాస్కరాచారి ఉపాధ్యాయునికి పని చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పని చేశారని కొనియాడారు. వారి సేవలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు కొమ్మడి ప్రభాకర్‌రెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు చింతల సత్యనారాయణరెడ్డి, చేతరాశి అంజయ్య, అనిల్ చేపూరి, కె.మహేందర్, సుబ్రమణ్యం శర్మ, ఉప్పలయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు మర్రి ఆనందం, సోమయ్య పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...