సూదగాని ఫౌండేషన్‌కు ఫూలే అవార్డు


Sat,May 25, 2019 11:24 PM

మోటకొండూర్: సూదగాని ఫౌండేషన్ చేస్తున్న సేవలకు మహాత్మా జ్యోతిరావు ఫూలే అవార్డు వరించింది. ఫూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలకు అందజేసిన గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ హీరో, నిర్మాత ఆర్.నారాయణమూర్తి, జేఎన్‌టీయూ రిజిస్ర్తార్ యాదయ్యతోపాటు సూదగాని ఫౌండేషన్ చైర్మన్ సూదగాని హరిశంకర్‌కు మహాత్మాజ్యోతిరావు ఫూలే అవార్డును అందజేశారు. శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సూదగాని ఫౌండేషన్ చైర్మన్, వర్టూర్ గ్రామవాసి, రాజ్యసభ మాజీ సభ్యుడు తూళ్ల దేవేందర్‌గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి సూదగాని హరిశంకర్‌కు అవార్డును అందజేశారు. శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా హరిశంకర్ మాట్లాడుతూ.. తాము నిర్వహిస్తున్న సేవలను గుర్తించి పూలే ఫౌండేషన్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ సేవలు మరింతగా విస్తరిస్తామని చెప్పారు. బహుజన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్నదే తమ అభిమతమని వివరించారు. కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి కృష్ణమూర్తి, సీనియర్ పాత్రికేయులు ఆకారం మల్లేశం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...