తాగునీటి కోసం కాలనీవాసుల ధర్నా


Sat,May 25, 2019 11:23 PM

ఆలేరుటౌన్ : మూడు రోజులుగా తమ కాలనీలో మంచినీరు రావడం లేదని ఆరోపిస్తూ ఆలేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు నాయకత్వం వహించిన అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ ఆలిండియా యువజన సంఘం అధ్యక్షుడు కొత్త కృష్ణ మాట్లాడుతూ.. పట్టణంలోని రైల్వేగేటు కాలనీ, పోచమ్మవాడ, కురుమసంఘం, భారత్‌నగర్ కాలనీలలో మూడు, నాలుగు రోజులుగా మంచినీరు రావడంలేదని ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. గత 15 రోజుల కిందట ధర్నా చేసినా అధికారులు స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అయ్యారని అన్నారు. అంతేకాక మురికికాల్వలు శుభ్రం చేయడంలేదని, వీధి దీపాలు వెలుగడం లేదని ఆరోపించారు. ధర్నాలో దయ్యాల భిక్షపతి, కడారి పద్మ, ఎనమాల లింగమ్మ, బొమ్మెల లక్ష్మి, రేణుక, యాట సక్కుబాయ్, దేవి బాలమ్మ, ప్రమీల, అనసూయ, కాలనీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...