బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు


Sat,May 25, 2019 11:23 PM

మోత్కూరు : బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్న ఘటన మోత్కూరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సీహెచ్ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గొలుసుల దుర్గయ్య కుమారుడు నర్సింహ(23)కు గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామానికి చెందిన పందిరి దుర్గయ్య-పూలమ్మల దంపతుల కుమార్తె స్రవంతి(17)ని ఇచ్చి వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. మోత్కూరు పట్టణంలోని శ్రీ మార్కండేయ ఫంక్షన్ హాల్‌లో వివాహ నిచ్చితార్థం జరిపించారు. విషయమై పోలీసులకు తెలియడంతో ఎస్సై హరిప్రసాద్ అక్కడకి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. వధువు, వరుడికి చట్టం ప్రకారం పెండ్లి ఈడు వచ్చే వరకు వివాహం జరిపించరాదని వారి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఆయా శాఖల అధికారులతో కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జైపాల్‌రెడ్డి, సీడీపీవో బి.యాదమ్మ, మహిళా ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...