మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


Sat,May 25, 2019 11:23 PM

భువనగిరి రూరల్ : మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాయగిరి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కోరె మహేశ్(26) గతేడాది కొరటికల్ చెందిన కల్పనతో వివాహం అయ్యింది. ఈ క్రమంలో మహేశ్.. తన భార్య కల్పనతో కలిసి రాయగిరిలో అద్దె ఇంట్లో ఉంటూ ఫార్చ్యూన్ బయోటెక్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. వారిద్దరి మధ్య గొడవ రావడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మహేశ్ తీవ్ర మనస్థాపానికి గురై అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న మహేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు తెలిపారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...