డిగ్రీలో చేరాలంటే.. దోస్త్ కట్టాల్సిందే...


Sat,May 25, 2019 12:47 AM

-ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు జూన్ 3 వరకు అవకాశం
- అడ్మిషన్లకు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఆధార్ తప్పనిసరి
-దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 (ఎంజీయూనివర్సిటీ)
యూజీ(డిగ్రీ) వివిధ కోర్సులలో 2019-20 విద్యా సంవత్సరానికై అడ్మిషన్లు ఆన్‌లైన్ విధానంలోనే చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలంగాణలోని ఆయా యూనివర్సిటీలు అడ్మిషన్లకై నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తు చేసుకోండిలా...
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధి యూనివర్సిటీలకు ఆన్‌లైన్ విధానంలో యూజీ అడ్మిషన్లు అందుబాటులోకి తెచ్చింది.
వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తొలుత విద్యార్థి ఇంటర్మీడియట్ హాల్‌టికెట్ నెంబర్, ఉత్తీర్ణత సంవత్సరం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, విద్యార్థి పేరు, తండ్రి పేరును నమోదు చేయాలి.
తర్వాత మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయి అందుకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు విద్యార్థులు రూ.200ను క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే కళాశాల ఎంపిక చేసుకోవాలి.

వీటిని కచ్చితంగా గమనించాలి...
తర్వత కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన విద్యార్థులు సీటు అలాట్‌మెంట్ అయినట్టుగా తాను రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
విద్యార్థులు ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. విద్యార్థికి సీటు వచ్చి తనకు కళాశాల ఇచ్చినప్పటికీ, మరల వేరే కళాశాలలో చేరాలి అనుకుంటే అప్పుడు నేరుగా ఆ కళాశాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో(దోస్తు వెబ్‌సైట్‌లో) సీటు నిర్ధారణ చేసుకోవాలి.
వెళ్లి సీటు నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఆప్షన్స్‌లో లాగిన్ కావాలి. అక్కడ సూచించిన రూపాయాలను ఫీజుగా చెల్లించాలి.
విడుత వరకు తనకు నచ్చిన కళాశాలలో సీటు రాకపోతే మళ్లీ తొలి పర్యాయం సీటు వచ్చిన కళాశాలలో చేరే అవకాశం వీరికి మాత్రమే ఉంటుంది.
వచ్చిన కళాశాలలోనే ఆ విద్యార్థికి రెండో విడుతలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉండదు.
విడుతత అడ్మిషన్లల్లో మొదటి విడతలో దోస్తు వెబ్‌సైట్‌లో రిజిస్టేషన్ చేసుకోలేకపోయిన విద్యార్థులతోపాటు ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ అడ్మిషన్లకు ఈనెల 22న నోటిఫికేషన్ విడుదలైంది. 23 నుంచి జూన్ 3 వరకు ఆన్‌లైన్‌లో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం.
ఎంపికకు వెబ్ ఆప్షన్స్‌కు ఈనెల 25నుంచి జూన్ 3వరకు అవకాశం ఉంది.
1, 3, 4న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన.
4న రూ.400 అపరాధ రుసుంతో దరఖాస్తుకు అవకాశం.
10న అడ్మిషన్ల తొలి జాబితా
10 నుంచి 15 వరకు అడ్మిషన్లు వచ్చిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్‌ల్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
జూన్ 10నుంచి 15వరకు రెండో విడుత రిజిస్టేషన్లు.
10నుంచి 15 వరకు రెండో పేస్ వెబ్ ఆప్షన్లు నమోదు(ైస్లెడింగ్).
15న రెండో విడుత ప్రత్యేక కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన అన్ని యూనివర్సిటీ హెల్ప్‌లైన్ సెంటర్స్‌లో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది.
20న రెండో లిస్టులో సీట్ అలాట్‌మెంట్ వివరాలు విడుదల.
లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జూన్ 20నుంచి 25 వరకు కళాశాలల్లో ఆన్‌లైన్‌ల్లో సెల్ఫ్ రిపోర్టు, కళాశాల ఫీజు చెల్లించాలి.
నుంచి 25 వరకు చివరి పేస్(మూడో విడుత) వెబ్ ఆప్షన్లు .
29న పైనల్ సీటు అలాట్‌మెంట్ లిస్టు విడుదల.
లిస్టులో సీటు వచ్చిన విద్యార్థులు జూలై 1 నుంచి 4 వరకు ఆయా కళాశాలల్లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీజు చెల్లించేందుందు అవకాశం.
1న సెమిస్టర్-1 తరగతులు ప్రారంభం.
ఎంజీయూలో హెల్ప్‌లైన్ సెంటర్...
నల్లగొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీలో దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కోఆర్డినేటర్‌గా ఆ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆకుల రవి వ్యవహరించనున్నారు. దోస్త్ అడ్మిషన్లపై ఏమైనా సందేహాలుంటే 9948571888, 9948361250 నెంబర్లను సంప్రదించాలి.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...