టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు


Sat,May 25, 2019 12:44 AM

మోటకొండూర్ : పవిత్రమాసం రంజాన్ పండుగ పురస్కరించుకొని టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ఈద్గా మసీదులో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో రాజకీయ అవసరాల కొసం ముస్లింలను వాడుకొంటున్నారని, కేవలం ఓటుబ్యాంకుగానే భావించరే తప్ప వారి మేలు కోరలేదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయలేని విధంగా ముస్లింలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నారన్నారు. శిథిలావస్థలో ఉన్న మసీదులను, షాదీఖానాలను నిధులిచ్చి బాగుచేశాడని, ఇమాంలకు నెలవారి వేతనాలు ఇచ్చారన్నారు. మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఉన్నత చదువులు, స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపించి అందరికి ఆదర్శప్రాయుడు అయ్యారన్నారు. రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు, బట్టలు ఇచ్చారన్నారు.

నిరుపేదలకు ఇండ్లు, రేషన్‌కార్డులు ఇచ్చి వారికి దేవుడయ్యారన్నారు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాలకు చెందినవారు తమ రాష్ట్రంలో కూడా అమలుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇఫ్తార్ విందులో భాగంగా ముస్లిం సోదరులకు పలురకాలైన పండ్లు, ఎండుద్రాక్షలు, పాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటకొండూర్ సర్పంచ్ వడ్డెబొయిన శ్రీలత, ఎస్సై వెంకన్న, ఉపసర్పంచ్ రేగు శ్రీనివాస్, వార్డు సభ్యులు రేగు ప్రభాకర్, జంగవెల్లి జహంగీర్, వంగపల్లి శ్రీను, ముస్లిం నాయకులు ఎండీ బుర్హాన్, ఎండీ లతీఫ్, ఎండీ జహాంగీర్, ఖలీల్, మెహీన్‌మియా, నాయకులు సుర్పంగ శివలింగం, స్థిరబొయని నర్సింగ్‌యాదవ్, రేగు సిద్ధయ్య, బొలగాని సత్యనారాయణ, బాల్దె రామకృష్ణ, రఘనాథరాజు, బుగ్గ భాస్కర్, రేగు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...