అక్రమ వెంచర్లపై కొరడా


Wed,May 22, 2019 11:49 PM

-అక్రమ వెంచర్లు చేస్తే సహించేదిలేదు
-చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 అక్రమ వెంచర్ల గుర్తింపు
-లక్కారంలోని ఐదు వెంచర్ల హద్దురాళ్లు తొలగింపు
-హెచ్‌ఎండీఏ చౌటుప్పల్ ఏరియా ఇన్‌చార్జి నర్సింహరాజు

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ:చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన అక్రమ వెంచర్లపై హెచ్‌ఎండీఏ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతి పొందకుండా చేసిన లక్కారంలోని ఐదు వెంచర్లలో హద్దురాళ్లను బుధవారం తొలగిం చారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ చౌటుప్పల్ ఏరియా ఇన్‌చార్జి నర్సింహరాజు మాట్లాడుతూ..నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే హద్దురాళ్లను తొలగించాల్సి వచ్చింద న్నారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 అక్రమ వెంచర్లు ఉన్న ట్లు గుర్తించామన్నారు. హద్దురాళ్ల తొలగింపు మరో వారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమ వెంచర్లు చేస్తే సహించే దిలేదని, హెచ్‌ఎండీఏ అనుమతి పొందాకే వెంచర్ చేయాలన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన అక్రమ వెంచర్లపై హెచ్‌ఎండీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి పొందకుండా ఏర్పాటు చేసిన వెంచర్ల హద్దురాళ్లను బుధవారం తొలగించారు. హెచ్‌ఎండీఏ చౌటుప్పల్ ఏరియా ఇన్‌చార్జి నర్సింహరాజు ఆధ్వర్యంలో లక్కారంలోని 5 వెంచర్ల హద్దురాళ్లను తొలగించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే హద్దురాళ్లను తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అనుమతి తీసుకోకుండా ఏర్పాటు చేస్తే అవి అక్రమ వెంచర్ల కిందికే వస్తాయని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 అక్రమ వెంచర్లు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. మరో వారం పాటు అక్రమ వెంచర్ల తొలగింపు కొనసాగుతుందన్నారు. హెచ్‌ఎండీఏ అనుమతి పొందాకే వెంచర్లు చేయాలని సూచించారు. కాగా, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హద్దురాళ్లను తొలగించారని కొంతమంది రియల్టర్లు ఆరోపించారు. హద్దురాళ్లను తొలగించొద్దని హెచ్‌ఎండీఏ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొంత సమయం ఇస్తే హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకుంటామని, అప్పటి వరకు హద్దురాళ్లను తొలగించొద్దని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ అధికారులు రఘునందన్‌రాజు, మజీద్, రజిని, శ్రావణి, మేనేజర్లు అంజన్‌రెడ్డి, వేణుగోపాల్, వెంకటేశం, సిబ్బంది పాల్గొన్నారు.

తొలగింపు పనుల పరిశీలన..
లక్కారంలో చేపట్టిన అక్రమ వెంచర్ల తొలగింపును హెచ్‌ఎండీఏ డీఎస్పీ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే ఉపేక్షించబోమన్నారు. అనుమతులు పొందాకే వెంచర్లు చేయాలని సూచించారు. అక్రమ వెంచర్లను తమ దృష్టికి తెస్తే వెంటనే తొలగిస్తామని స్పష్టం చేశారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...