అందుబాటులో రాయితీపై విత్తనాలు


Wed,May 22, 2019 11:46 PM

బీబీనగర్: ప్రభుత్వం రాయితీలపై వరి, జీలుగ విత్తనాలు అందిస్తుందని, మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అనూరాధ అన్నారు. బుధవారం మండల వ్యవసాయాధికారి పద్మతో కలిసి బీబీనగర్‌లోని పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్‌లోని విత్తనాలు, ఎరువులను పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మెన్ వాకిటి సంజీవరెడ్డిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులు తమ పాసు పుస్తకం జిరాక్స్ కాపీతో పాటు ఆధార్ కార్డును చూపించి పేరును నమోదు చేసుకుంటే రాయితీపై పీఏసీఎస్ కార్యాలయంలో విత్తనాలు అందజేస్తామన్నారు. బీపీటు 25కిలోల బస్తాపై రూ.125, ఎంటీయూ 10:10.. 30కిలోల బస్తాపై రూ.150, కేఎన్‌ఎం118.. 30కిలోల బస్తాపై రూ.300, జీలుగ 30కిలోలకు రూ.1005 రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...