విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి


Wed,May 22, 2019 11:46 PM

రాజాపేట : విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.వెంకన్న వినియోగదారులకు సూచించారు. బుధవారం మండలంలోని బొందుగుల, నెమిల, దూదివెంకటాపురం గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ జిల్లాలో రూ.51 లక్షల విద్యుత్ బకాయిలున్నాయని, వెంటనే వినియోగదారులు బకాయిలను చెల్లించాలన్నారు. లేనిచో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు నిరంతరం వెలుగుతున్నాయని, పగటి వేళల్లో వెలుగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. టాన్స్‌ఫార్మర్ల వద్ద ఆన్, ఆఫ్ స్విచ్‌లను దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మండల విద్యుత్ అధికారి వెంకటేశ్, లైన్‌మెన్లు వెంకటేశ్, రాజరత్నం ఉన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...