ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Wed,May 22, 2019 11:45 PM

నాంపల్లి : ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ , ప్రణాళికబద్దంగా ఉపాధ్యాయులు బోధనందించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మొత్తం 5 పాఠశాలల్లో 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 298మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 99.33శాతం సాధించి మండలంలో ప్రథమస్థానంలో నిలిచారు. మండల కేంద్రంలో ఆదర్శపాఠశాల, కస్తూర్బాగాంధీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలోని ముష్టిపల్లి పాఠశాలలో 22 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22మంది ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థిని అనూష 10జీపీఏ సాధిం చి మండలంలో టాపర్‌గా నిలిచింది. మోడల్ స్కూల్‌లో 95 మంది విద్యార్థులకు 95మంది ఉత్తీర్ణులు కాగా 100శాతం ఫలితాలు సాధించారు. పస్నూర్ ఉన్నత పాఠశాలలో 38 మంది విద్యార్థులకు 38మంది ఉత్తీర్ణత సాధించారు. నాంపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో 113మంది విద్యార్థులకు 112మంది ఉత్తీర్ణులైనారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో 32మంది విద్యార్థులకు గాను 31మంది ఉతీర్ణత సాధించారు. అక్టోబర్ నుంచి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతులు తీసుకొని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వలనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...