పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి


Tue,May 21, 2019 12:28 AM

నీలగిరి : పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 23న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు దృష్ట్యా హైదరాబాద్‌లో జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఓరియంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్‌ కేంద్రంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వీడియోగ్రాఫర్లను నియమించాలని కోరారు. స్ట్రాంగ్‌రూమ్‌లో కూడా వీడియో, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈవీఎంలను తెరిచిన పిదప రాంగ్‌ ఎంట్రీలు లేకుండా లెక్కించాలని, ఓట్ల లెక్కింపు, వీవీప్యాట్స్‌ లెక్కించడం తదితర విషయాలపై ఓటింగ్‌ ఏజెంట్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎండల దృష్ట్యా స్టాండ్‌ ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ విషయంలో పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తామని, అయినప్పటికీ అన్ని బందోబస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సీనియర్‌ కన్సల్టెంట్‌ బన్వర్‌లాల్‌ మాట్లాడుతూ.. సర్వీస్‌ ఓటర్లు, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, ఓటరు వర్కవుట్‌ట, సువిధ యాప్‌లో నమోదు తదితర విషయాలపై డెమో నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...