ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేయాలి


Tue,May 21, 2019 12:28 AM

నీలగిరి : ఈనెల 23న నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నల్లగొండ కలెక్టర్‌, నల్లగొండ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమమ్‌కుమార్‌, ఎస్పీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే ఐటీ టెక్నీషియన్స్‌, జడ్పీటీసీ రిటర్నింగ్‌ అధికారులు, నియోజకవర్గ కేంద్ర మండల పర్యవేక్షణ అధికారులతో కౌంటింగ్‌ ప్రక్రియ ఏర్పాట్లపై సమీక్షించారు. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్‌, నోడల్‌ అధికారులు సమన్వయంతో పని చేసి ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం విధివిధానాలు, చేయాల్సిన ఏర్పాట్లు, న్యాయపరమైన అంశాలు, వరుసక్రమం, అధికారుల విధులు, బాధ్యతలు, స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి కౌంటింగ్‌ హాల్‌కు ఈవీఎంలు తరలించే విధానం, స్ట్రాంగ్‌రూమ్‌లకు ఏజెంట్లు, సిబ్బంది అనుమతి, ఓట్ల లెక్కింపు విధానం, కౌంటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, ఫలితాలు వెల్లడించే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, మీడియా సెంటర్ల ఏర్పాటు వివరాలు తెలిపే విధానం, లెక్కింపు అనంతరం ఈవీఎంలను భద్రపరిచే అంశాలపై వివరించారు. సమావేశంలో జేసీ చంద్రశేఖర్‌, సూర్యాపేట డీఆర్‌ఓ చంద్రయ్య, నల్లగొండ డీఆర్‌ఓ రవీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...