యాదాద్రిలో భక్తుల సందడి


Tue,May 21, 2019 12:27 AM

రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో మొదటగా గంటన్నర పాటు శివుడ్నికొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో అభిషేకం చేసి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడ్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాతవేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములు శర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనరసింహుడి బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 12,03,063 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 12,03,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 1,16,154, కల్యాణకట్ట ద్వారా రూ. 36,000 వత్ర పూజల ద్వారా రూ. 90,000, ప్రసాద విక్రయాలతో రూ. 5,59,890, గదుల విచారణ శాఖతో రూ. 79,600, శాశ్వత పూజల ద్వారా రూ. 6,000 తోపాటు అన్ని విభాగాల నుంచి శ్రీవారి ఖజానాకు ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
స్వామి వారిని దర్శించుకున్న
ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయన స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...