కౌంటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి


Tue,May 21, 2019 12:27 AM

కట్టంగూర్‌ : ఈనెల 27న నిర్వహించే ప్రాదేశిక ఎన్నికల కౌటింగ్‌ సమయంలో కౌటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ భూక్యా యాకూబ్‌నాయక్‌ అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లకు కౌటింగ్‌ విధి విధానాలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ సిబ్బంది కౌంటింగ్‌ హాల్‌కు గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. చెల్లే ఓట్లు, చెల్లని ఓట్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రతి రౌండ్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీటీసీకి మూడు, జడ్పీటీసీకి 8 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సురేందర్‌, గోపి, వెంకటరమణ, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కౌంటింగ్‌పై అవగాహన
నార్కట్‌పల్లి : మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం అభ్యర్థులకు, ఏజెంట్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్టవేణి, ఎంపీడీఓ సాంబశివరావు, ఈఓఆర్డీ లక్ష్మినారాయణ, విష్టవర్ధన్‌, మోహన్‌, అనిల్‌, అరుణ్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌, గిరిప్రసాద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, భానుప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
గురింప్తు కార్డులతో హాజరుకావాలి : ఎంపీడీఓ శ్రీరాములు
కేతేపల్లి : ఈనెల 27న నిర్వహించే ప్రాదేశిక ఎన్నికల కౌటింగ్‌ సమయంలో సిబ్బంది గుర్తింపు కార్డులతో హాజరుకావాలని ఎంపీడీఓ శ్రీరాములు అన్నారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఈఓపీఆర్డీ అస్గర్‌అలీ, శిక్షకుడు కుశలవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...