గురుకులాలు భేష


Sat,May 18, 2019 11:51 PM

- కార్పొరేట్‌కు దీటుగా వసతులు
- నిరంతర పర్యవేక్షణ, రుచికరమైన మెనూ
- నాణ్యమైన విద్యకు కేరాఫ్‌ అడ్రస్‌గా గురుకులాలు
- మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన గురుకులాలు కార్పొరేట్‌కు ధీటుగా విజయవంతంగా నడుస్తున్నాయి. నాణ్యమైన బోధన, ఉత్తమ ఫలితాల సాధన, నిరంతర పర్యవేక్షణ, రుచికరమైన మెనూకు చిరునామాగా నిలుస్తున్నాయి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం పెంచిన మెస్‌ చార్జీలకు అనుగుణంగా నూతన మెనూ అమలవుతున్నది. ప్రతిరోజూ సన్నబియ్యంతో భోజనంతోపాటు నెలకు నాలుగు సార్లు చికెన్‌, రెండు సార్లు మటన్‌ వడ్డిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకల వసతులు కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మెరికల్లాగా తయారవుతున్నారు. ఆటల్లో రాణించి.. పది, ఇంటర్‌ ఫలితాల్లో ప్రతిభ చాటుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ గురుకులాల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతియేటా అడ్మిషన్ల కోసం పోటీ పెరుగుతున్నది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ విద్యకు ధీటుగా గిరిజన గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నది.

నాణ్యమైన విద్యకు కేంద్రంగా...
జిల్లాలో మైనార్టీ పాఠశాలలు మూడు ఉన్నాయి. భువనగిరిలో బాలుర, ఆలేరు, చౌటుప్పల్‌ల్లో బాలికల పాఠశాలలు ఉన్నాయి. గురుకులాలు రాజాపేట, భువనగిరి, ఆలేరు, అడ్డగూడూరుల్లో ఉన్నాయి. భువనగిరి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బాలికలు 200 మంది విద్యనభ్యసిస్తున్నారు. గిరిజన బాలికలు, బాలుర వసతి గృహాలు ఆరు ఉన్నాయి. ఇందులో 803 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భువనగిరిలో రెండు బాలిక, బాలుర కళాశాలలు ఉన్నాయి. ఇందులో 210 మంది విద్యనభ్యసిస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులు అన్నం తిని పడుకోవచ్చు. వసతి గృహాల్లో ఉంటూ విద్యార్థులు ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదువుతున్నారు. నెలకు నాలుగు సార్లు చికెన్‌, రెండుసార్లు మటన్‌, ప్రతిరోజూ ఉదయం బొర్నవిటాతోపాటు మధ్యాహ్న భోజనంలో నెయ్యి, చట్నీ, న్యూడిల్స్‌, పకోడి వంటి అదనపు పదార్థాలు అందిస్తున్నది. వీటితోపాటు గిరిజన విద్యార్థుల విజ్ఞానం మరింత అభివృద్ధి చెందేందుకుగాను రూ.12.29 లక్షలతో సైన్స్‌ ల్యాబ్‌ పరికరాలు, రూ.10.85 లక్షలతో గ్రంథాలయ పుస్తకాలు, ఇనుప బీరువాలు, జిల్లాలోని డిగ్రీ, జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల సౌకర్యం కోసం ఫర్నిచర్‌, వంట పాత్రలు తదితరుల కొనుగోలు నిమిత్తం గతేడాది రూ. 52.30 లక్షలు వెచ్చించింది. విద్యతోపాటు సకల సౌకర్యాలూ కల్పిస్తున్నది. ఏడాదికి మూడు జతల యూనిఫామ్‌తోపాటు బెడ్‌షీట్స్‌, టవల్స్‌ దగ్గర నుంచి ప్లేట్లు, గ్లాసుల వరకూ సకలం అందిస్తున్నది.

గురుకులాల్లో అనుదిన కార్యక్రమాలు..
ప్రతిరోజూ ఉదయం విద్యార్థులకు యోగా, వ్యాయామాలతోపాటు బూస్ట్‌ సౌకర్యం కల్పిస్తారు. తరువాత విద్యార్థులు స్నానం ఆచరించి ఉదయకాలపు పర్యవేక్షణ తరగతులకు హాజరవుతారు. తర్వాత రకరకాల అల్పాహారాలు (న్యూడిల్స్‌, పూరీ, బోండా, ఇడ్లీ, పులిహోర, కిచిడి) తీసుకుంటారు. తరువాత దినచర్యలో భాగంగా తరగతులకు హాజరవుతారు. పాఠశాల తరగతులతోపాటు ఇంగ్లీష్‌ క్లబ్‌, డబ్ల్యూ+ క్లబ్‌, టీ+క్లబ్‌, అంకుర్‌, ఆపరేషన్‌ ఐన్‌స్టీన్‌, స్పెల్‌బీ, ఇన్నర్‌ హౌసెస్‌ కాంప్లిటేషన్‌, ఇగ్నైట్‌, యూత్‌ పార్లమెంట్‌, కల్చరల్‌ ఫెస్ట్‌, జోనల్‌, స్టేట్‌ లెవల్‌ గేమ్స్‌ అండ్‌ ఇంటర్‌ సొసైటీ లీగ్‌, సైన్స్‌ ఫెయిర్‌, అడ్వెంచర్‌, స్పోర్ట్స్‌ పేరుతో రాక్‌ ైక్లెంబింగ్‌, భారత్‌ దర్శన్‌, మిర్రర్‌ ప్రాజెక్టు, కారదీపత్‌, ఫ్లిప్పుడ్‌ క్లాసెస్‌, సెమినార్‌ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...