టాటాఎస్‌ ఢీకొని మహిళ మృతి


Sat,May 18, 2019 11:43 PM

ఆలేరుటౌన్‌ : టాటాఎస్‌ వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శనివారం సాయంత్రం జరిగింది. మృతురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణం బహదూర్‌పేటకు చెందిన జంపాల నాగమణి(45) ఉదయం 11 గం.ల ప్రాంతంలో ఇంటి నుంచి ఎస్సీ కాలనీకి వెళ్తున్నది. అదేసమయంలో ఆలేరు నుంచి మంతపురికి వెళ్తున్న టాటా ఎస్‌ వాహనం నాగమణిని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో రోడ్డు పై పడిపోవడంతో ఆమె మీదనుంచి వాహనం వెళ్లిపోయింది. దీంతో తీవ్రగాలై రోడ్డుపై తీవ్రరక్తస్రావంతో పడిఉన్న నాగమణిని బంధువులు ఆలేరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలి భర్త అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్‌రెడ్డి తెలిపారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...