ప్రజలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి


Sat,May 18, 2019 11:42 PM

ఆలేరుటౌన్‌ : ప్రజలు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని ఆలేరు మండలం శారాజీపేట పీహెచ్‌సీ వైద్యురాలు డా.జ్యోతిబాయి అన్నారు. సమాజంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను గుర్తించి వారికి చికిత్స చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యమిషన్‌ కార్యక్రమం చేపట్టి అందులో భాగంగానే గ్రామస్థాయిలో వైద్యచికిత్సలు ప్రారంభించింది. శనివారం ఆలేరు పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో హెల్త్‌క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.జ్యోతిబాయి మాట్లాడుతూ.. దీర్ఝకాల వ్యాధులైన రక్తపోటు, మధుమేహం, నోటీక్యాన్సర్‌, రొమ్ముక్యాన్సర్‌, గర్భాశయక్యాన్సర్‌, శ్యాస సంబంధిత వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఈ వ్యాధులపై వారికి సరియైన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. దీనికి సంబంధించి ప్రాథమికస్థాయిలో గుర్తించి దానికి తగిన విధంగా చికిత్స చేయించుకుంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం సమగ్రడేటా తయారుచేసి దానికి తగ్గట్టుగా చికిత్సను అందించేందుకు గ్రామస్థాయిలో ప్రతి శనివారం ఒక్కో గ్రామంలో ఆరోగ్యక్యాంపులను ఏర్పాటుచేసి ప్రైమరీ స్టేజిలో దానికి చికిత్స చేయడం, సీరియస్‌ కేసులను జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో చికిత్స చేసి వారికి సంపూర్ణఆరోగ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రజలు ఈ ఆరోగ్యక్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని, ఆరోగ్యతెలంగాణ కల సాకారం చేయాలని ఆమె కోరారు. ఈ ఆరోగ్యకాంపునకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 78 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో డా.సత్యప్రకాశ్‌, పీహెచ్‌ఎన్‌ పెద్దలక్ష్మి, హెచ్‌ఈవో యాకయ్య, హెల్త్‌ సూపర్‌వైజర్‌ పాపయ్య, డీఈవో కిష్టయ్య, ఎంపీహెచ్‌ఈవో సురేశ్‌, ఆరోగ్యమిత్ర సుమ, సిస్టర్లు సత్యవతి, అనూజ, జయమ్మ, స్వర్ణలత, ఆశ వర్కర్లు సువర్ణ, వాణి, కళ, విజయలక్ష్మి, కళమ్మ, మంజుల, నాగమణి తదితరులు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...