రైతు సమగ్ర సర్వేకు సహకరించాలి


Sat,May 18, 2019 12:00 AM

మోటకొండూర్ : వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం నిచ్చే రైతు సమగ్ర సర్వేకు ప్రతి రైతు సహకరించి, తమ వ్యవసాయానికి సంబంధించిన వివరాలు తెలుపాలని మండల వ్యవసాయాధికారి సుబ్బూరు సుజాత అన్నారు. శుక్రవారం మోటకొండూర్ వ్యవసాయ కార్యాలయంలో పలువురి రైతుల నుంచి సర్వే వివరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 8612 మంది రైతులకు 6198 రైతులు సర్వేలో పాల్గొన్నారని తెలిపారు. మిగతా రైతులు ఈ నెల 20లోపు సమాచారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్వేత, శివాణి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...