పదో తరగతి విద్యార్థినులకు సన్మానం


Sat,May 18, 2019 12:00 AM

అడ్డగూడూరు : పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు సంధ్య, సౌమ్య, రమశ్రీలను శుక్రవారం మండల కేంద్రంలో బీసీ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండలాధ్యక్షుడు తుప్పతి బీరప్ప, నాయకులు బాలెంల దుర్గయ్య, బుచ్చయ్య, కృష్ణమూర్తి, శ్రీను, పరుశురాములు, వినోద్ పాల్గొన్నారు.

విద్యార్థులకు, తల్లిదండ్రులకు సన్మానం..
సంస్థాన్‌నారాయణపురం : మండల పరిధిలోని సర్వేల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు జి.కీర్తన, అజయ్, మౌనికను, వారి తల్లిదండ్రులను శుక్రవారం ప్రధానోపాధ్యాయుడు ఎం.విద్యాధర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే విద్యపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం విద్యార్థులను, వారి తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, నర్సింహ, రామకృష్ణారెడ్డి, నాగభూషణచారి, నర్సిరెడ్డి, అబ్దుల్జ్రాక్, వనజ, పద్మాలక్ష్మి, నీరజ, నీల, అరుణ, వెంకటలక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...