వరకట్నం వేధింపులు


Thu,May 16, 2019 11:52 PM

భువనగిరి అర్బన్‌ : అదనపు కట్నం కోసం తనను వేధించడమే కాకుండా తన భర్తకు మరో పెళ్లి చేయాలని తమ అత్తామామలు చూస్తున్నారని ఓ వివాహిత గురువారం తన ఆవేదన వ్యక్తం చేసింది. భార్తవి, తండ్రి కోటేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్‌బినగర్‌కు చెందిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎలిగే శంకర్‌, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఎలిగే శ్రీకాంత్‌. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఎం.కోటేశ్వర్‌రావు, నాగమణి దంపతుల కుమార్తె భార్గవితో శ్రీకాంత్‌కు 2017 జూలై 28న వివాహం జరిగింది. పెళ్లికి కానుకగా భార్గవి తల్లిదండ్రులు రూ.16 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, ఇతర ఖర్చుల నిమిత్తం మరో రూ.5 లక్షలు కట్నంగా ఇచ్చారు.

వివాహం జరిగిన రెండు నెలల నుంచి అత్తింటి వారు అదనపు కట్నం తేవాలని తనకు నరకం చూపిస్తున్నారని భార్గవి ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగాన్ని మాన్పించారని, ఇంట్లో ఉన్న పనిమనిషిని మాన్పించి తనతో ఇంటి పనులు చేయించారని తెలిపింది. తన భర్తకు ఫోన్‌ చేయాలన్నా.. మాట్లాడాలన్నా మామ అనుమతి తీసుకోవాలని చెప్పింది. భార్యాభర్తలను కలువనీయకుండా తన భర్తకు దూరం చేశారు. తన అత్తామామలతోపాటు ఆడపడుచు, మరిది వేధించడం, మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించేవారని చెప్పారు. తన కూతురుకు న్యాయం చేయాలని కోరుతూ భార్గవితోపాటు తండ్రి కోటేశ్వర్‌రావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన చెప్పారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...