కాళీయమర్ధన శ్రీ కృష్ణాలంకార విశిష్టత..


Thu,May 16, 2019 11:51 PM

భగవానుడి దివ్యాలంకారంలో దేనిప్రత్యేక దానిదే. అయినా గోకులంలో శ్రీకృష్ణావతార వైశిష్ఠ్యం ఒక వైభవం. దీనిని జ్ఞానులు, యోగులు దర్శించారు. మానవునిగా నడియాడుతున్నందుకు మానవ ధర్మాన్ని ఒకవైపు, తనదైన పరమాత్మతత్వాన్ని మరోవైపు కలబోసి కనిపింపజేసిన కమనీయమూర్తి శ్రీకృష్ణుడు. గోకులంలో భక్తుల రక్షణార్థమై చూసిన అపూర్వ లీలలో కాళీయమర్ధనం లీల ఎంతో విశిష్టమైనది. కాళీయుడి యొక్క విషపు కోరలను చిదిమి కాళీయుడి గర్వాన్ని అణచి యమునా నది నీటిని విషమయం కాకుండా సంరక్షించిన తీరు దుష్టులైన వారి యొక్క అహంకారమనే విషకోరలను చిదిమి శిష్టులైన తన భక్తులను రక్షిస్తానని గొప్ప సందేశాన్ని ఈ అవతారంలో దర్శించే అవకాశం కల్పించారు. భక్తకోటి రక్షణయే పరమావధిగా నాడు శ్రీకృష్ణ పరమాత్మ యధుసింహంగా (బాలసింహంగా) దర్శనమిచ్చిన తీరుతెన్నులు ఈ అలకారసేవలో భక్తులు దర్శించారు.


యాదాద్రిభువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ:
యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారి అధ్యయ నోత్సవాలలో గురువారం కుంకుమార్చన నిర్వహించారు. కాళీయమర్ధన, శ్రీ కృష్ణాలంకార సేవను నిర్వహించారు. రాత్రి శ్రీరామ అవతార అలంకార సేవ హనుమంత వాహనంలో ఊరేగించారు. ఉదయం నిత్య హవనములు, మూల మంత్ర జపములు, లక్ష్మీసూక్త విష్ణుసహస్రనామ పారాయణం పారాయనికులచే నిర్వహించారు. శ్రీస్వామి వారి అమ్మవార్లకు లక్ష కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. మంగళ నీరాజనం, మంత్రపుష్పకంకైర్యము వైభవంగా పాంచ రాత్రగామ శాస్త్ర రీత్యా స్థానాచార్యుడు , ఆలయ ప్రధానార్చుకులు, యాజ్ఞిక బృందం , అర్చక బృందం, వేదపండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా
జరిగాయి.

సాయంకాల కార్యక్రమములు
సాయంత్రం బాలాలయంలో సాయంత్రం గం. 7 నిత్య హవనములు, సామూహిక పారాయణములు, మూల మంత్ర జపములు, పారాయణావతారములు, పారాయణీకులచే నిర్వహించారు. అనంతరం శ్రీరామ అవతార అలంకారసేవ శ్రీ హనుమంత వాహనముపై బాలాలయములో భక్తుల దర్వనార్థము ఊరేగింపు జరిపారు.

శ్రీరామ అవతార అలంకార సేవ
శ్రీ హనుమంత వాహన విశిష్టత..
జయంతి సందర్భంగా శ్రీవారు శ్రీరాముని అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీరాముని అవతార విశేషాలను ప్రధానార్చకులు నల్లంతీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. భగవానుడు ధర్మస్థాపన చేయుటకై దుష్టశిక్షణ, శిష్టపరిరక్షణార్థం త్రేతాయుగాన అవతరించిన అవతారమే శ్రీరామ అవతారం. ‘ రామోవిగ్రహవాన్‌ ధర్మ’ అన్నట్లుగా మూర్తీభవించిన ధర్మరూపుడు శ్రీరాముడు. మాత, పితృ, ఆచార్యులపై భక్తిభావము, ఒకే మాట, ఒకే భానము, ఒకే పత్నీ అన్న ఆదర్శాలతో మర్యాద పురుషోత్తమునిగా ఘనకీర్తి వహించాడు శ్రీరాముడు. భారతీయ సంస్కృతి సంపూర్ణంగా శ్రీరాముని చరితయందు సుప్రతిష్టమైన ఉన్నది. ఆదర్శమూర్తియైన శ్రీరాముడు నేటి విశ్వమానవులకు ఆదర్శనీయుడు ఉపాసనీయడు, సమస్తమానవ సంస్కృతికి ఆదర్శమూర్తియైనాడు. వజ్రకాయుడు, మహాశక్తి సంపన్నుడు, ప్రబల పరాక్రమంగలవాడు. మహామేధావి, వేదవేదాంగ శాస్త్ర పారంగతుడు. తన జీవిత సర్వస్వాన్ని శ్రీరాముని సేవకే అంకింతం చేసిన హనుమంత వాహనంపై శ్రీలక్ష్మీనరసింహుడు శ్రీరామాలంకారములో భక్తులకు దర్శనమివ్వగా దర్శించిన భక్తులకు ఎంతో మేలు కలుగుతుంది.

సాంస్కృతిక కార్యక్రమాలు ..
సాయంత్రం కొండపైన భక్తుల మనోల్లాసమునకై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీపాండురంగ భజన మండలి వారిచే భజనను నిర్వహించారు. శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి వారిచే భక్తిసంగీతం ఆలపించారు. యాదాద్రి డ్యాన్స్‌ అకాడమీ వారిచే కూచికపూడి నృత్యాలు భక్తులను ఎంతగానో అలరించాయి.

ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్యశిబిరాలు ..
నృసింహ జయంతి ఉత్సవమంలో భాగంగా కొండపైన శ్రీచక్రబ్లాక్‌-3 లో ఉచిత వైద్యసేవలు అందించారు. సప్తగిరి దవఖాన, దిల్‌సుఖ్‌నగర్‌ ఎండీ జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌ హరీశ్‌కుమార్‌ వారిచే ఉచిత వైద్యశిబిరం ఉదయం గం. 10 నుంచి మధ్యాహ్నం గం. 2 వరకు నిర్వహించారు. భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్యసేవలను పొందారు. శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో నృసింహ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ప్రధానాలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం పాత గుట్టలో కూడా ఆలయ ఏఈవో దోర్భల భాస్కరశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఉప ప్రధానార్చకులు బట్టర్‌ సురేంద్రాచార్యులు ఉత్సవ కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహామూర్తి, కార్యనిర్వాహణాధికారి ఎన్‌.గీత , వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఆలయాధికారులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.వెండి కలశాలను సమర్పించిన భక్తుడు ..యాదాద్రిశ్రీలక్ష్మీనరసింహస్వామివారికి వెండి కలశాలను తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన భక్తులు లక్కా

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...