స్త్రీనిధి డబ్బులను కాజేసిన ఐకేపీ సీసీ


Thu,May 16, 2019 11:47 PM

ఆత్మకూరు(ఎం) : స్త్రీ నిధి రుణాలు పొందిన మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులను ఖాతాలో వేయకుండా ఐకేపీ సీసీ భుంగబాబుకు అవసరానికి వాడుకొని ఆగం చేసిండు. ఈ విషయం గురువారం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని సర్వేపల్లి గ్రామానికి చెందిన 44 మంది స్త్రీనిధి ద్వారా రుణాలు పొందిన మహిళల నుంచి వసూలు చేసిన రూ.74,166 ఐకేపీ సీసీ భుంగబాబు స్త్రీనిధి ఖాతాలో వేయమని గత నెల 15వ తేదీన ఇచ్చినట్టు మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు సుంకిశాల అరుణ తెలిపారు. స్త్రీనిధి ఖాతాలో ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు వేయలేదని సీసీని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్త్రీనిధి డబ్బులను కాజేసిన సీసీ నుంచి రికవరీ చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...