రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత


Thu,May 16, 2019 11:46 PM

ఆత్మకూరు(ఎం) : అక్రమంగా రేషన్‌ బియ్యంతో తరలివెళ్తున్న లారీని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కొరటికల్‌-పల్లెపహాడ్‌ గ్రామాల మధ్య గల ఆకుల అంజయ్య వ్యవసాయ బావి వద్ద 200 బస్తాల రేషన్‌ బియ్యం తూకం వేసి లారీలో లోడ్‌ చేయగా నమ్మదగ్గ సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే రేషన్‌ బియ్యం లారీలో లోడు చేసిన వ్యాపారులతోపాటు లారీ డ్రైవర్‌ పారిపోయాడని ఏఎస్సై రమేశ్‌ తెలిపారు. బియ్యం లారీతోపాటు హమాలీలను పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...