రాఘవాపురంలో ఉద్రిక్తం


Thu,May 16, 2019 12:00 AM

టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ
ఇరు వర్గాలకు గాయాలు, రెండు కార్లు ధ్వంసం
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

బీబీనగర్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే మంగళవారం అర్ధరాత్రి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సంఘటన బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండారు విక్రమ్ అనే యువకుడు తన వాట్సప్ స్టేటస్‌లో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడైన కొర్ని పాండుకు వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో పోస్టు పెట్లాడు. పాండు విక్రమ్ ఇంటికి వెళ్లి మందలించే క్రమంలో ఇద్దరికీ మాటా మాటా పెరిగి ఇరువురు దాడికి దిగారు. ఈ దాడిలో పాండు తలకు గాయమైంది. గొడవ జరిగిందన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యాంగౌడ్ తన అనుచరులతో కలిసి విక్రమ్ ఇంటి వద్దకు చేరుకొని తమ కార్యకర్తను కొడతారా అంటూ ఎదురు దాడికి దిగారు. ఈ దాడిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న విక్రమ్ తండ్రి సుర్వి బస్వరాజు ఛాతిపై బలంగా గుద్దడంతో సృహ కోల్పోయి పడిపోయాడు. విక్రమ్ బాబాయి జంగయ్య బస్వరాజును దవాఖానకు తీసుకెళ్లే క్రమంలో తనపై కూడా దాడి చేసి తన కారు అద్దాలను ధ్వంసం చేయడంతో బయంతో పరుగులు తీస్తూ ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా విడవకుండా ఆ ఇంటి తలపులు పగులగొట్టి వీరంగం సృష్టించారు.

కాగా పోలీసులు గొడవ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకన్నా దాడి చేస్తున్న నాయకులను ఏ మాత్రం అదుపుచేయలేకపోయారని స్థానికు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయాలంటూ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆదే సమయంలో తమ కార్యకర్తపై దాడి చేశారంటూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, జడ్పీటీసీ అభ్యర్థి భర్త శ్యాంగౌడ్ తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి రాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గొడవను అదుపు చేయడానికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అదే సమయంలో కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. అనుచరులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని శ్యాంగౌడ్‌ను విడిచి పెట్టాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో శ్యాంను పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు పంపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి బుధవారం గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి, గొడవకు సంబంధించిన వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై న్యాయ విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై సుధాకర్‌కు సూచించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అదే మనసులో పెట్టుకొని కక్షలకు పోవొద్దని సూచించారు. గ్రామస్తులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటూ గ్రామాభివృద్దికి తోడ్పడాలని కోరారు. అనంతరం దాడిలో గాయపడ్డ బస్వరాజును కలిసి పరామర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో తలెత్తిన విభేదాలు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సుర్వి బస్వరాజ్, బండారు ఆనంద్ తదితరులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. దీంతో ఇరు వర్గాల మద్య విభేదాలు తలెత్తాయి. ఇది చిలికి చిలి గొడవ పెద్దగా మరింది.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...