అట్టహాసంగా ప్రారంభమైన టీఎస్‌పీఈసెట్


Wed,May 15, 2019 11:59 PM

జెండా ఊపి క్రీడలను ప్రారంభించిన
చైర్మన్ ప్రొఫెసర్ హుస్సేన్,
కన్వీనర్ సత్యనారాయణ
ఎంజీ యూనివర్సిటీ : తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యూకేషన్ కళాశాలల్లో బీపీఈడీ, యుజీడీపీఈడీలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్‌పీఈసెట్-2019 క్రీడోత్సవం బుధవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి ఆ సెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తరలి రావడంతో తెల్లవారుజామునే అంతా సందడి సందడిగా కనిపించింది. ఫిజికల్ ఎఫిసెన్సి క్రీడలను టీఎస్‌పీఈసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆ సెట్ కన్వీనర్‌ప్రొ. వి. సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. అనంతరం క్రీడలు ప్రారంభమయ్యాయి. టీఎస్‌పీఈసెట్ ఫిజికల్ ఎఫిసెన్సిక్రీడలు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తొలి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు వివిధ అంశాల్లో క్రీడా పరీక్షలను నిర్వహించారు. క్రీడా పరీక్షలకు వచ్చిన విద్యార్థులు తమ ప్రతిభను చూపి విజయం సాధించేందుకు పోటీ పడ్డారు. 400 మార్కులకు జరిగిన పరీక్షలో వారు తలపడ్డారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...