క్రీడాకారులు పోటీ పడ్డది ఈ అంశాల్లోనే..


Wed,May 15, 2019 11:56 PM

పురుషుల విభాగంలో జరిగిన ఫిజికల్ ఎఫిసెన్సి టెస్ట్‌కు 100 మీటర్లు, 800 మీటర్ల రన్, 6 కేజీల షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్‌తో పాటు ఇతర అంశాలలో జరిగాయి. వీటికి 400 మార్కులు కేటాయించారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన వారినే విజయం వరించనుంది.
తొలి రోజు హాజరైన 345 మంది క్రీడాకారులు..
తొలిరోజు బీపీఈడీ, డీపీఈడీ కోసం దరఖాస్తు చేస్తున్న 512 మంది హాజరు కావల్సి ఉండగా 345 మంది హాజరైనారు. వీరిలో బీపీఈడీకి 280 మందికి గాను 182 మంది హాజరు కాగా 98 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీలో 232 మంది హాజరు కావల్సి ఉండగా 163 మంది హాజరు కాగా 69 మంది గైర్హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థులు సరైన కారణాలు చూపితే ఈ నెల 21లోగా హాజరు కావడానికి అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, ఎంజీయూ స్పోర్ట్సు బోర్డు కార్యదర్శి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి, హాస్టల్స్ డైరెక్టర్ మారం వెంకట రమణారెడ్డి, పీడీలు డాక్టర్ వై.శ్రీనివాసరెడ్డి, ఆర్.మురళి పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...