రైతులు మద్దతుధర పొందాలి: కలెక్టర్‌


Wed,May 15, 2019 12:06 AM

నీలగిరి: జిల్లాలో రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి డీఆర్‌డీఏ, సహకార, రవాణా, వ్యవసాయ శాఖ, ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి కొన్న ధాన్యం వెంటనే ఆయా మండలాలకు ట్యాగ్‌ చేసిన మిర్యాలగూడ, సిద్దిపేట, జిల్లాలోని మిల్లులకు పంపిణీ చేయాలన్నారు. సరిపడా వాహనాలను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ అధికారులను కోరారు. మిల్లుల్లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ట్రాక్‌షీట్లు పెండింగ్‌ ఉంటే పౌర సరపరాల డీటీలు పరిష్కరించాలన్నారు. తహసీల్దార్లు కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ చంద్రశేఖర్‌, పీడీ శేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల డీఎం నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌రెడ్డి, ముక్తానందం తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...