రెండ్రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలి


Wed,May 15, 2019 12:06 AM

నల్లగొండరూరల్‌: నల్లగొండ పట్టణపరిధిలోని ఆర్జాలబావి సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘం (పీఏసీఎస్‌) గొల్లగూడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు నల్లగొండ మండలంలోని తొరగల్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లు, తేమశాతం రవాణా, అన్‌లోడింగ్‌ సమస్యలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన వరి ధాన్యం వెంటనే లారీ కాంట్రాక్టర్‌, రవాణ శాఖ అధికారులు అవసరమైన లారీలను ఏర్పాటు చేసి ట్యాగ్‌ చేసిన మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బుధవారం లోగా కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు రవాణా చేయాలన్నారు. మిల్లులలో దాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పీడీని , పౌర సరఫరాల శాఖ డీఎంను ఆదేశించారు. జిల్లాలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో మిగిలిన 3 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్‌తో పాటు డీఆర్‌డీఏ ఏపీడీ శేఖర్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ నాగేశ్వర్‌రావు, మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ వెంకటరెడ్డి, పీఏసీఎస్‌ సీఈవో అనంతరెడ్డి, రైతులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...