‘తేరా’ గెలుపునకు సమష్టిగా కృషిచేయాలి


Wed,May 15, 2019 12:06 AM

మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ: నల్లగొండ స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా కృషి చేయాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ టీఆర్‌ఎస్‌ కార్యాలయం లో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఏ ఎన్నికలు అయినా టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ స్థానిక సంస్థల అభ్యర్థి తేరా చిన్నపరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్సీ ఎన్నికల పరిశీలకుడు చిత్తరంజన్‌దాస్‌, మాజీఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణాధ్యక్షుడు తిరునగరు భార్గవ్‌, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, దుర్గంపూడి నారాయనరెడ్డి, చిర్ర మల్లయ్యయాదవ్‌, ఎండీ. మోషీన్‌అలీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...