ప్రశాంతంగా పోలింగ్‌


Wed,May 15, 2019 12:05 AM

బొమ్మలరామారం : జిల్లా, ప్రాదేశిక పరిషత్‌ మూడో విడుత ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండలంలో నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా ఒక జడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకుగాను మొత్తంగా 26,524 మంది ఓటర్లు ఉండగా 24,202 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని 91.2 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎంపీడీవో సరిత తెలిపారు. 11 ఎంపీటీసీ స్థానాలకుగాను ప్యారారంలో 2281 మంది ఓటర్లకుగాను 1898 మంది ఓటు హక్కు వినియోగించుకొని 83.2 శాతం, జలాల్‌పూర్‌లో 2989కి 2669 మందితో 89.3శాతం, రామలింగంపల్లిలో 2207 మంది ఓటర్లకు 2134 మందితో 96.7 శాతం, చీకటిమామిడిలో 1357కు 94.8శాతం, చౌదర్‌పల్లిలో 2620 మందికిగాను 2404 పోలింగ్‌తో 91.8 శాతం, మర్యాలలో ఎంపీటీసీ పరిధిలో 2393 మందికిగాను 2174 మందితో 90.8 శాతం, మేడిపల్లిలో 2666 మందికిగాను 2435తో 91.3 శాతం, నాగినేనిపల్లిలో 3272 మందికిగాను 3024 మందితో 92.4 శాతం, బొమ్మలరామారంలో 2632 మందికిగాను 2361తో 89.7 శాతం, తిమ్మాపూర్‌లో 2089 మందికిగాను 1941తో 92.9 శాతం, గోవింద్‌తండాలో 2018 మందికి గాను 1875 ఓట్లతో 92.9 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఆమె చెప్పారు. మండలంలో అత్యధికంగా రామలింగంపల్లిలో ఓటింగ్‌ శాతం పెరిగినట్టు తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...