గులాబీ ప్రభంజనం ఖాయం


Wed,May 15, 2019 12:05 AM

బొమ్మలరామారం : మండలంలో జడ్పీటీసీతోపాటు 11 ఎంపీటీసీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడుతూ ప్రభంజనం సృష్టించడం ఖాయమని జడ్పీటీసీ అభ్యర్థి ఎలిమినేటి సందీప్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గూదె బాల్‌నర్సింహ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు అండగా ప్రజలందరూ నిలిచారన్నారు. సీఎం కేసీఆర్‌కు చేయూతనందించాలనే లక్ష్యంతో ఓటర్లందరూ ఈ పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపునకు సహకరించారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఆదరించి ఆశీర్వదించిన ఓటర్‌ మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. సమావేశంలో నాయకులు పొలగౌని వెంకటేశ్‌గౌడ్‌, కుశంగల సత్యనారాయణ, కట్ట శ్రీకాంత్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ జూపల్లి భరత్‌, కుక్కదువ్వు గణేశ్‌, భేతాల పాండు, వెంకటేశ్‌, గోపాల్‌, కర్నెకంటి రాజు, కుమార్‌, సత్యనారాయణ, పట్టణాధ్యక్షుడు బండి మహేశ్‌గౌడ్‌, రాజు, వార్డు సభ్యులు భాస్కర్‌, నరేశ్‌, నర్సింహ మల్యాల, బొమ్మలరామారం టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ సభ్యులు ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...